తెలుగు సినిమా ఎప్పుడు చేసేది చెప్పిన అట్లీ !

తెలుగు సినిమా ఎప్పుడు చేసేది చెప్పిన అట్లీ !

Published on May 15, 2018 1:39 PM IST

తమిళ యువ దర్శకుడు అట్లీ కుమార్ ‘మెర్సల్’ తర్వాత తెలుగు చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారని గతంలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆయన కూడ తన తర్వాతి చిత్రాన్ని తెలుగులోనే, స్టార్ హీరోతో చేస్తానని, చర్చలు జరుగుతున్నాయని, అవి పూర్తయ్యాక సినిమాను ప్రకటిస్తానని చెప్పి ఆ తర్వాత తన నెక్స్ట్ సినిమా తమిళంలోనే ఉంటుందని అనౌన్స్ చేశారు.

దీంతో అందరిలోను మరి అట్లీ తెలుగులో సినిమా చేయడా అనే సందేహం రేకెత్తింది. వాటికి సంధానం అన్నట్టుగా తాజాగా తమిళ మీడియాతో మాట్లాడిన ఆయన త్వరలోనే తన కొత్త సినిమాను ప్రకటిస్తానని, దాని తర్వాత తెలుగు సినిమా చేస్తానని అన్నారు. అంటే ఈ ఏడాది ఆఖరులో కానీ 2019 ఆరంభంలోకానీ అట్లీ తెలుగులో సినిమా చేయొచ్చని స్పష్టమైంది.

తాజా వార్తలు