
ప్రస్తుతం తమిళ యువ హీరోల్లో టాప్ లిస్టులో ఉన్న వాళ్లలో దుల్కర్ సల్మాన్ కూడ ఒకరు. కథ బలం ఉన్న సినిమాల్ని ఎంచుకుంటూ ఎప్పటికప్పుడు తనలోని నటుడ్ని కొత్తగా పరిచయం చేసే దుల్కర్ మలయాళం తర్వాత తమిళ సినిమాల్లోనే కనిపిస్తూ తమిళ ప్రేక్షకుల్లకు దగ్గరైన దుల్కర్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడ అభిమాన హీరోయిగా మారిపోయారు.
ఇటీవల విడుదలైన ‘మహనటి’ చిత్రంలో జెమినీ గణేశన్ పాత్రలో ఆయన ప్రదర్శించిన సహజమైన నటనకు ఇక్కడ యువ ప్రేక్షకులతో పాటు సినీ పెద్దలు సైతం ఫిదా అయిపోయి ఆయనకు అభిమానులుగా మారిపోయారు. ఇక నుండి దుల్కర్ తెలుగు సినిమాలు కూడ చేయాలని తెలుగు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ క్రేజ్ మూలాన ఇకపై తెలుగు నుండి పెద్ద ఆఫర్లు దుల్కర్ ను వరించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి దుల్కర్ మలయాళం, తమిళ సినిమాలతో పాటు స్ట్రయిట్ తెలుగు సినిమాలు కూడ చేస్తారో లేదో చూడాలి.

