యువ హీరోతో పవన్ దర్శకుడి సినిమా !

యువ హీరోతో పవన్ దర్శకుడి సినిమా !

Published on May 24, 2018 9:03 AM IST

పవన్ కళ్యాణ్ తో ‘గోపాల గోపాల, కాటమరాయుడు’ వంటి రెండు భారీ సినిమాలను రూపొందించిన దర్శకుడు కిశోర్ కుమార్ పార్థసాని (డాలి). 2017లో వచ్చిన ‘కాటమరాయుడు’ తరవాత కిశోర్ కుమార్ ఇప్పటి వరకు మరో సినిమా చేయలేదు కాదు కదా కనీసం ప్రకటించలేదు కూడ.

తాజా సమాచారం మేరకు ఆయన ఒక యువ హీరోతో సినిమా చేసే పనుల్లో ఉన్నారట. ఆ హీరో ఎవరో కాదు నితిన్. కిశోర్ కుమార్ ఇప్పటికే నితిన్ కు కథ చెప్పారని, కత నచ్చడంతో నితిన్ సినిమా చేసేందుకు సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది. అన్నీ సక్రమంగా జరిగితే వీరి చిత్రం ఈ ఏడాది రెండవ అర్ధ భాగంలో మొదలయ్యే అవకాశాలున్నాయట. మరి ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే అధికారిక సమాచారం వెలువడే వరకు ఆగాల్సిందే.

తాజా వార్తలు