సెన్సార్ పూర్తి చేసుకున్న రాజు గాడు !

సెన్సార్ పూర్తి చేసుకున్న రాజు గాడు !

Published on May 28, 2018 8:02 PM IST

రాజ్ తరుణ్ ,అమైరా దస్తూర్ జంటగా కొత్త దర్శకురాలు సంజనా రెడ్డి తెరకెక్కించిన చిత్రం రాజు గాడు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమం ముగించుకొని జూన్ 1న విడుదలకు సిద్ధంగా ఉంది .ఈ చిత్రానికి సెన్సార్ యు /ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. రాజ్ తరుణ్ ఈ సినిమాలో క్లేప్టోమేనియా వ్యాధి కలిగిన పాత్రలో నటించాడు. ఈ వ్యాధి వల్ల తనకు తెలియకుండానే దొంగతనం చేసేస్తుంటాడు. దొంగతనం సమయంలో వచ్చే సన్నివేశాలు హిలేరియస్ గా ఉండనున్నాయి .

రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటించాడు . గోపి సుందర్ సంగీతం అందించిన ఈ సినిమాని ఏ కె ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. ఈ మధ్య వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్ ని ఈ రాజు గాడు అయిన సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందో లేదో చూడాలి .

తాజా వార్తలు