మరో పెద్ద బ్యానర్ లో సినిమా చేయనున్న’ఛలో’డైరెక్టర్ !

మరో పెద్ద బ్యానర్ లో సినిమా చేయనున్న’ఛలో’డైరెక్టర్ !

Published on Jun 1, 2018 1:16 AM IST

తన మొదటి సినిమా ‘ఛలో’ తో మంచి హిట్ కొట్టాడు వెంకీ కుడుముల. ఇప్పుడు ఈ దర్శకుడితో సినిమాలు చేయడానికి రెడీ గా ఉన్నారు బడా నిర్మాతలు.ఈ క్రమంలోనే తన తర్వాతి సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చేయనున్నారని తెలిసిందే .

తాజాగా హారిక హాసిని బ్యానర్ లో మరో సినిమా చేయనున్నాడు . ఈ సంస్థ డైరెక్టర్ త్రివిక్రమ్ తో ఎక్కువగా సినిమాలు నిర్మిస్తూ వస్తుంది .అయితే వెంకీ త్రివిక్రమ్ శిష్యుడన్న కారణంతోనే ఈ ఆఫర్ వచ్చిందని అంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను తొందర్లోనే ప్రకటించే అవకాశం ఉంది . ఏది ఏమైనా ఒక్క సినిమాతో వరుసగా పెద్ద బ్యానర్ లలో సినిమా అవకాశాలు దక్కించుకుంటున్నాడు వెంకీ .

తాజా వార్తలు