‘తేజ్ ఐ లవ్ యు’ను ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తేనే తేజ్ మార్కెట్ నిలబడుతుంది !

‘తేజ్ ఐ లవ్ యు’ను ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తేనే తేజ్ మార్కెట్ నిలబడుతుంది !

Published on Jun 3, 2018 12:44 AM IST

ఒకప్పుడు వరుస హిట్లతో మినిమమ్ గ్యారంటీ హీరో అనిపించుకున్నా మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇప్పుడు వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతూ ‘తేజ్‌ ఐ లవ్‌ యు’ చిత్రంతో జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రేమకథలు తీయడంలో ఎక్స్ పర్ట్ అయిన కరుణాకరన్ దర‍్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తోంది.

అయితే వరస ప్లాప్ లతో ప్రేక్షకులను తరచు నిరుత్సాహపరిచిన తేజ మార్కెట్ కూడా సినిమా సినిమాకి తగ్గుతూ వచ్చింది. దీంతో ‘తేజ ఐ లవ్ యు’ హిట్ అయితేనే తేజ్ మార్కెట్ మరింత పడిపోకుండా కొంతైనా నిలబడే పరిస్థితి ఏర్పడింది. మరి వీక్షకుల ఈ చిత్రానికి ఎలాంటి తీర్పును ఇస్తారో చూడాలి.

తాజా వార్తలు