మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా సినిమా భారీ షెడ్యూల్ షూటింగ్ ఈ నెల 7 నుండి హైద్రాబాద్లో జరుగనుంది. సుమారు 40 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో ఈ సినిమాకు సంభందించిన పోరాట సన్నివేశాలను తెరకేక్కిన్చనున్నారని సమాచారం .
ఇక ఈ చిత్ర షూటింగ్ అనుకున్నంత వేగంగా జరగడం లేదని తెలుస్తుంది. ఇప్పటివరకు 25 శాతం షూటింగ్ మాత్రమే కంప్లీట్ చేసుకుంది . ఎలాగైనా ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలని చిరంజీవి బావిస్తున్నారట.ఇక నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు . ఈ సైరా సినిమా స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.


