కార్తీ నటిస్తున్న తాజా చిత్రం ‘కడైకుట్టి సింగం’.ఈ సినిమాలో కార్తీ అన్నయ్య స్టార్ హీరో సూర్య అతిథి పాత్రలో మెరవనున్నాడని సమాచారం. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సూర్య నే నిర్మాత కావడం విశేషం. నిన్న సూర్య చేతుల మీదుగా రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్ కి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ సినిమాలో కార్తీ రైతు పాత్రలో అదరగొట్టనున్నాడు.
ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ పతాకం ఫై మిర్యాల రవీందర్ రెడ్డి ‘చినబాబు’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. మరి ఈ సినిమాలో సూర్య కనబడేది నిజమే కాదో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాలి. సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి పాండి రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.


