నితిన్ ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్లో ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. వచ్చే నెల నుంచి పోస్ట్ ప్రొడక్షన్ కూడా మొదలుకానుంది. ఈ సినిమా తర్వాత నితిన్ ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక కామెడీ ఎంటర్ టైనర్ చెయ్యబోతున్నాడు. నితిన్ కోసం వెంకీ తయారుచేసిన స్క్రిప్ట్ చాలా బాగుందని టాక్.
ఈ సినిమా ఆగష్టు నుంచి మొదలవ్వబోతు౦దట. ‘ఛలో’ సినిమాలో లాగానే వెంకీ ఈ సినిమాలో కూడా ఎంటర్టైన్మెంట్ ను ప్రధానాంశంగా తీసుకున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నాగ వంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.


