వివాదాల్లో ‘భరత్ అనే నేను’ చిత్రం !

వివాదాల్లో ‘భరత్ అనే నేను’ చిత్రం !

Published on Jun 5, 2018 2:40 PM IST

ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల వసూళ్లు సాధించిన ‘భరత్ అనే నేను’ చిత్రం మరోసారి వివాదాల్లోకెక్కింది. ఇప్పటికే ఒక రచయిత ‘భరత్ అనే నేను’ చిత్ర కథ నాదే అంటూ రచయితల సంఘంలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరొక వివాదం ఈ చిత్రాన్ని చుట్టుముట్టింది.

చిత్రంలో ‘నవోదయం’ పార్టీ పేరును, గుర్తును వాడి ‘నవోదయం’ పార్టీ అవినీతిమయం అన్నట్లుగా చూపించారని ‘నవోదయం’ పార్టీ అధ్యక్షుడు నల్లకరాజు ఆరోపించారు. గుంటూరు ఎస్పీ ని కలిసి ఫిర్యాదు కూడా చేశారు. మరి ఈ వివాదాంపై దర్శక నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

తాజా వార్తలు