హీరో పాత్రలతో పాటు నెగెటివ్ పాత్రలు కూడా పోషించే కోలీవుడ్ నటుడు దునియా విజయ్ పరారీలో ఉన్నాడు. దునియా విజయ్ ఒక నిర్మాత తరుపున పోలీసులతో గొడవ పడినట్టు తెలుస్తోంది. పోలీసులు మాత్రం తమ విధి నిర్వహణలో ఆటంకం కలిగించాడని దునియా విజయ్ మీద కేసు నమోదు చేసారు.
కోర్టు కూడా అతడిని తక్షణం అరెస్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు అందుకున్న పోలీసులు దునియా విజయ్ ని అరెస్ట్ చేయడానికి వెళ్లగా.. ఈ లోగా పోలీసులు వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న దునియా విజయ్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అజ్ఞాతంలో నుంచే తన లాయర్ ద్వారా దునియా విజయ్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇంకా ఆయనకి బెయిల్ మంజూరు కాలేదు.


