యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా, కొత్త దర్శకుడు చక్రవర్తి తెరకెక్కిస్తున్న చిత్రం ‘పంతం’. ఈ చిత్రం టీజర్ నిన్న విడుదలైంది. టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా ఈ టీజర్ వన్ మిల్లియన్ వ్యూస్ ను కూడా దాటింది. ఈ టీజర్ లో గోపీచంద్ నటన ముఖ్యంగా కోర్ట్ సీన్ లో పలికిన భారీ డైలాగ్ ఆసినిమాపై ఆసక్తిని పెంచింది. మంచి సామాజిక సందేశంతో ఈ చిత్రం తెరకెక్కినట్టు తెలుస్తోంది. గోపీచంద్ కెరీర్ లోనే ‘పంతం’ స్పెషల్ కానుందట. ‘యజ్ఞం’ తర్వాత గోపీచంద్ కు ‘పంతం’ కథ అంత బాగా సూట్ అవుతుందని సమాచారం.
వరుస పరాజయాలతో సతమతవుతున్న గోపీచంద్ కు ఈ చిత్ర విజయం కీలకం కానుంది. ఇది ఆయనకు 25వ చిత్రం. కే కే రాధామోహన్ ‘సత్యసాయి ఆర్ట్స్ పతాకం’ఫై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీచంద్ సరసన మెహరీన్ హీరోయిన్ గా నటిస్తోంది. గోపి సుందర్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రం జులై 5న విడుదల కాబోతుంది.


