విడుదలకు సిద్దమైన ‘ఆటగదరా శివ’ ట్రైలర్ !

విడుదలకు సిద్దమైన ‘ఆటగదరా శివ’ ట్రైలర్ !

Published on Jun 6, 2018 5:05 PM IST

దర్శకుడు చంద్ర సిద్దార్థ తాజా చిత్రం ‘ఆటగదరా శివ’. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ఆసక్తి గొలిపే విధంగా ఉండగా ఇప్పుడు చిత్ర ట్రైలర్ విడుదలకానుంది. రేపు ఉదయం 9 గంటలకు ఈ ట్రైలర్ ప్రేక్షకులముందుకురానుంది. మానవ సంబంధాలను, మానవీయ కోణాల్ని హైలెట్ చేస్తూ సినిమాలు చేసే చంద్ర సిద్దార్థ దర్శకత్వం కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

గతంలో ఈయన ‘ఆ నలుగురు, మధుమాసం, అందరి బంధువయా’ వంటి పలు హిట్ సినిమాల్ని రూపొందించారు. ఇకపోతే దాదాపు అన్ని పనులు ముగించుకున్న ఈ సినిమా ఈ నెలాఖరున విడుదలకానుంది. ‘భజరంగీ భాయీజాన్, లింగ’ వంటి సినిమాల్ని నిర్మించిన నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు