తమిళ స్టార్ నటుడు ఇళయదళపతి విజయ్ టుటికోరిన్ స్టెరిలైట్ ప్రొటెస్ట్ బాధిత కుటుంబాలను నిన్న రాత్రి పరామర్శించారు. తాను వస్తున్నాడు అని తెలిస్తే ఫాన్స్ చాలా మంది వచ్చే అవకాశం ఉండడంతో పబ్లిసిటీ కాకూడదని విజయ్ బైక్ ఫై బాధితుల పరామర్శ కోసం రాత్రి వచ్చాడు.
ఇక బాధిత కుటుంబాలను పరామర్శించిన విజయ్ తన తరుపున ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఇంతకు ముందు కమల్ హాసన్ , రజిని కాంత్ లు కుడా తూత్తుకుడి బాధితులను పరామర్శించారు. రజినీకాంత్ మృతుల కుటుంబాలకు 2 లక్షల ఆర్థిక సాయం చేశారు .
గత నెల తమిళనాడులోని టుటికోరిన్ జిల్లాలో జరిగిన స్టెరిలైట్ ప్రొటెస్ట్ కాల్పుల్లో 13 మంది చనిపోయిన విషయం తెలిసిందే.దాంతో ఆ స్టెరిలైట్ కర్మాగారాన్ని శాశ్వతంగా మూసి వేసింది తమిళనాడు ప్రభత్వం.


