తమ నటనకు మెచ్చి నటి నటులకు,సాంకేతిక నిపుణులకు ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డ్ లో ఒకటి ఫిలిం ఫేర్ అవార్డ్స్. తాజాగా సౌత్ కు సంబంధించిన 65వఫిలిం ఫేర్ అవార్డ్స్ నామినేషన్స్ ను ప్రకటించారు. వివిధ క్యాటగిరీల్లో ఈ అవార్డ్స్ దక్కించుకునేందుకు చాలా మంది కళాకారులు పోటీ పడుతుంటారు . అయితే అన్ని విభాగాల్లో కన్నా బెస్ట్ యాక్టర్ (మేల్ ) క్యాటగిరీ ఫై అందరి చూపు ఉంటుంది. తెలుగులో ఈసారి ఈఅవార్డు కోసం ముగ్గురు సీనియర్ హీరోలు, ఇద్దరు టాప్ యంగ్ హీరోలు, ఒక కుర్ర హీరో పోటీపడుతున్నారు.
‘ఖైదీ నంబర్ 150’ చిత్రానికి గాను చిరంజీవి, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రానికి గాను బాలకృష్ణ, అలాగే ‘గురు’ సినిమాతో వెంకటేష్ , ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్, ‘జై లవకుశ’తో ఎన్టీఆర్ మరియు ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విజయ్ దేవరకొండ ఈ బెస్ట్ యాక్టర్ క్యాటగిరీకి నామినెట్ అయ్యారు.
మరి ఈ అవార్డును ఎవరు గెలుచుకుంటారో చూడలనుకుంటే జూన్ 16 వరకు ఆగాల్సిందే. ఎందుకంటే అదే రోజు హైద్రాబాద్లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఈ అవార్డుల ప్రధానోత్సవం జరుగనుంది.


