మహేష్ బాబు, సుకుమార్ సినిమా ఖారారు !

మహేష్ బాబు, సుకుమార్ సినిమా ఖారారు !

Published on Jun 7, 2018 6:46 PM IST

రంగస్థలం సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాప్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సుకుమార్, తన తర్వాత సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చెయ్యనున్నారని చాలా కాలంగా వినిపిస్తున్న మాట. ఇప్పుడు ఈ మాట నిజం కాబోతుంది. గతంలోనే సుకుమార్ మహేష్ బాబుకు తన చిత్రకథకు సంబంధించిన లైన్ వినిపించారు. ఆయన చెప్పిన ఆ లైన్ కు మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో సుకుమార్ తన ‘టీం’తో స్క్రిప్ట్ వర్క్ చేశారు. స్క్రిప్ట్ మొదటి డ్రాప్ట్ పూర్తయింది. చాలా బాగా వచ్చిందట. ఫోన్ లోనే సుచాయగా స్క్రిప్ట్ విన్న మహేష్ సుకుమార్ తో ఈ సినిమా మనం చేస్తున్నాం అని మాట ఇచ్చినట్టు సమాచారం.

ప్రస్తుతం మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్సకత్వంలో తెరెకెక్కుతున్న తన 25వ చిత్రంలో నటించబోతున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు,అశ్వినిదత్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పూర్తయిన తర్వాతే మహేష్, సుకుమార్ దర్సకత్వంలో నటించనున్నారు. అయితే ఈ లోగా సుకుమార్ పూర్తి స్క్రిప్ట్ ను సిద్దం చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు