‘కళ్యాణ్ రామ్’కి పోటీగా వస్తున్న ‘సుధీర్ బాబు’ !

‘కళ్యాణ్ రామ్’కి పోటీగా వస్తున్న ‘సుధీర్ బాబు’ !

Published on Jun 8, 2018 8:23 PM IST

kalyanran sudheerbabu

నందమూరి కళ్యాణ్ రామ్, సుదీర్ బాబు ఈ వారంలో ఒక్క రోజు తేడాతో తమ సినిమాలను రిలీజ్ చెయ్యబోతున్నారు. భావోద్వేగంతో నిండిన ప్రేమ ప్రధానాంశంగా ఈ రెండు చిత్రాలు తెరకెక్కాయి. ఒకే అంశంత ఒక్క రోజు తేడాతో బరిలోకి దిగుతున్న ఈ రెండు చిత్రాల్లో ఏది విజయం సాధిస్తుందో..? కళ్యాణ్ రామ్ తన కెరీర్ లో మొదటిసారి చేస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘నా నువ్వే’ చిత్రం. కళ్యాణ్ రామ్ కొత్తగా కనిపించటానికి చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ చిత్రంలో నటించారు. ముఖ్యంగా ‘తమన్నా, కళ్యాణ్ రామ్’ మధ్య నడిచే ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులకు కట్టిపడేస్తాయట. ఈ చిత్రానికి మరో ప్రధానాకర్షణ పిసి. శ్రీరామ్. పిసి కెమెరా పనితనం, జయేంద్ర దర్శకత్వం ఈ ‘నా నువ్వే’ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లనున్నాయని టాక్.

అలాగే దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు, అదితి రావ్ హైదరిలు హీరోహీరోయిన్లుగా రాబోతున్న చిత్రం ‘సమ్మోహనం’. సినిమా నేపథ్యంలో సాగే ఈ చిత్రం మీద కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇంద్రగంటి ‘జెంటిల్ మెన్, అమీ తుమీ’ లాంటి సినిమాలతో సక్సెస్ ట్రాక్ లో ఉండటం, మంచి అభిరుచి గల నిర్మాత అని పేరు ఉన్న శివలెంక కృష్ణప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించడం, సుధీర్ బాబు, అదితి రావ్ నటన వంటివి ఈ చిత్రానికి ప్రధాన బలాలు. మరి అన్ని విషయాల్లో పోటా పోటీగా ఉన్న ఈ రెండు చిత్రాల్లో ఏ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.

తాజా వార్తలు