కాలా ఫస్ట్ డే కలెక్షన్స్ !

కాలా ఫస్ట్ డే కలెక్షన్స్ !

Published on Jun 9, 2018 1:20 AM IST

సూపర్ స్టార్ రజిని కాంత్ నటించిన కాలా సినిమా నిన్న విడుదలై నెగిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది. అయితే కబాలి చిత్రం తో పోలిస్తే ఈ సినిమా మంచి బిజినెస్ చేయలేకపోయింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఈ చిత్రం 3. 5 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది .ఇక్కడ ఈ సినిమా భారీ మొత్తానికే అమ్ముడు పోయింది.

మరి ఈ మూడు రోజులు ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించనుంది.వచ్చే సోమవారం నుండి కాలా ఇక్కడ పెద్ద పరీక్ష నే ఎదురుకోనుంది . పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నానా పటేకర్ ,హుమా ఖురేషి ముఖ్య పాత్రల్లో నటించారు .

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో రజినీకాంత్ నటన ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది .సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ సినిమాని రజిని అల్లుడు స్టార్ హీరో ధనుష్ నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు