తమిళ నటులు పలువురు తెలుగులో తరచూ సినిమాలు చేయడం మామూలు విషయమే. కానీ ఇప్పుడు తెలుగు నటులు సైతం తమిళ పరిశ్రమలో పాగా వేస్తున్నారు. తెలుగులో నటుడిగా నిలదొక్కుకోవాలని ట్రై చేస్తున్న నటుడు శత్రు తమిళ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు.
తెలుగులో ‘కృష్ణగాడి వీరప్రేమగాథ, బాహుబలి-2, జై లవ కుశ, రంగస్థలం, భరత్ అనే నేను’ వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు తమిళ హీరో కార్తీ నటించిన ‘కాడైకుట్టి సింగం’ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్రం తెలుగులో ‘చినబాబు’ పేరుతో విడుదలకానుంది. మిర్యాల రవీందర్ రెడ్డి సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని పాండిరాజ్ డైరెక్ట్ చేశారు.


