నాన్నగారి ఆశయాల కోసం కృషి చేస్తా – బాలకృష్ణ

నాన్నగారి ఆశయాల కోసం కృషి చేస్తా – బాలకృష్ణ

Published on Jun 11, 2018 2:00 PM IST

balakrishna

ఇండో అమెరికన్‌ బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్ లో జరిగిన తన జన్మదిన వేడుకల్లో బాలకృష్ణ మాట్లాడుతూ.. నాన్నగారి ఆశయాల కోసం తాను నిరంతరం కృషి చేస్తానని, ఆయన కోరుకున్న విధంగానే మనమందరం ముందుకు వెళ్దామని అభిమానులకి పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే త్వరలో అమరావతిలో కూడా ఇండో అమెరికన్‌ బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్ ను 15 ఎకరాల స్థలంలో నిర్మిస్తామన్నారు.

అభిమానులు నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని సందర్శించిన బాలయ్య ఇలాగే అభిమానులందరూ సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇకపోతే బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ఎన్టీఆర్ బయోపిక్’ వచ్చే నెలలో మొదలుకానుంది. ఎన్టీఆర్ జీవితంలోని ఎవ్వరికి తెలియని కొన్ని ఘట్టాలను ముఖ్యంగా ఎన్టీఆర్ యువకుడిగా ఉన్నప్పుడు ఆయన జీవితంలో జరిగిన విషయాలను బయోపిక్ లో చూపించబోతున్నామని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బాలయ్య చెప్పారు.

తాజా వార్తలు