మెగా అల్లుడు ఎలా ఇంప్రెస్ చేస్తాడో చూడాలి !

మెగా అల్లుడు ఎలా ఇంప్రెస్ చేస్తాడో చూడాలి !

Published on Jun 11, 2018 6:21 PM IST

Vijetha

చిరంజీవి అల్లుడిగా వెండి తెర మీదికి ఎంట్రీ ఇవ్వనున్నాడు కళ్యాణ్ దేవ్. ఆయన నటించిన మొదటి చిత్రం ‘విజేత’ జూలై నెలలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే చిరు కుటుంబం నుండి ఐదుగురు యువ హీరోలు పరిశ్రమలో ఉండగా వాళ్ళందరికంటే భిన్నంగా కళ్యాణ్ దేవ్ ఏం చేస్తారో, అతని స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుందో చూడాలని మెగా ఫాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వాళ్లందరి కోసం రేపు 12వ తేదీ ఉదయం 8 గంటల 59 నిముషాలకు చిత్ర టీజర్ ను విడుదలచేస్తున్నారు. అలాగే ఆడియో వేడుకను చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ ల సమక్షంలో ఈ నెల 24న విడుదలచేయనున్నారు. వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు రాకేష్ శశి డైరెక్ట్ చేస్తున్నాడు.

తాజా వార్తలు