‘పెళ్ళి చూపులు’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన తెలుగమ్మాయి ‘రితూ వర్మ’ దుల్కర్ సల్మాన్ తో కలిసి ఒక తమిళ చిత్రంలో నటిస్తోందని అందరికి తెలిసిన విషయమే. తాజా సమాచారం ప్రకారం త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ పూర్తి కానుంది. ఈ రోజు ఢిల్లీలో చిత్రబృందం ప్రధాన షెడ్యూల్ ను కూడా పూర్తి చేసింది.
ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా అతి త్వరలోనే ప్రారంభించనున్నారు. ఈ చిత్రం విడుదల తేదీని మూవీ మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు. ఈ చిత్రం పేరు ‘కణ్ణుమ్ కణ్ణుమ్ కొల్లాయ్ ఆదిత్తాల్’ గా పెట్టారు. ఈ చిత్రాన్ని దేసింగ్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో రితూ వర్మకు ఇది రెండవ చిత్రం. మొదటి చిత్రం విక్రమ్ పక్కన ‘ధృవ నట్చత్తిరమ్’లో నంటించారు.
ఈ చిత్రంతోనైనా రితూ వర్మ తమిళంలో హీరోయిన్ గా బిజీ అవుతారేమో చూడాలి. ‘పెళ్లిచూపులు’ తర్వాత తెలుగులో నిఖిల్ చిత్రంలో తప్ప చెప్పుకోదగ్గ అవకాశాలను దక్కించుకోలేకపోయిన రితూ తమిళంలో మాత్రం ‘దుల్కర్ సల్మాన్’ పక్కన నటించే అవకాశం దక్కించుకుంది.


