కాలా నాలుగు రోజుల కలెక్షన్స్ !

కాలా నాలుగు రోజుల కలెక్షన్స్ !

Published on Jun 12, 2018 1:09 AM IST

Kaala6

సూపర్ స్టార్ రజిని కాంత్ నటించిన కాలా ఈ నెల 7న విడుదలై నెగిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఈ చిత్రం 3. 5 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసిన తరువాత 3 రోజుల కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి . ఈ చిత్రం నాలుగు రోజులకు గాను 6.5 కోట్ల షేర్ ను మాత్రమే కలెక్ట్ చేసింది . మరి ఈ చిత్రం ఫుల్ రన్ లో ఎంత షేర్ ను కలెక్ట్ చేస్తుందో చూడాలి .

అటు తమిళ్ లో తలైవా చరిష్మా వల్ల వసూళ్లు బాగానే ఉన్నాయి . కబాలి సినిమా తరువాత రజిని, రంజిత్ కి మళ్ళి అవకాశం ఇచ్చేసరికి ఈ సారి మంచి సినిమానే రానుందని అందరు అనుకున్నారు . కాని కాలా కూడా కబాలి సినిమాలాగే తయారైంది.సినిమా స్లో గా ఉండడం కేవలం రజినీకాంత్ నటన తప్ప ఈ సినిమాలో పెద్దగా ఆకట్టుకునే అంశాలు లేకపోవడం వలన కాలా యావరేజ్ సినిమా గా మిగిలిపోయింది . నానా పటేకర్ ,హుమా ఖురేషి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాని ధనుష్ నిర్మించారు . .

తాజా వార్తలు