గండికోటలో షూటింగ్ జరుపుకుంటున్న విక్రమ్ సినిమా !

గండికోటలో షూటింగ్ జరుపుకుంటున్న విక్రమ్ సినిమా !

Published on Jun 11, 2018 10:00 PM IST

swami0

చియాన్ విక్రమ్,కీర్తి సురేష్ జంటగా తమిళ భాషలో తెరకెక్కుతున్న చిత్రం ‘సామీ స్క్వేర్’.ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కడప జిల్లా గండిపేట లోని మాధవరాయ స్వామి దేవాలయం వద్ద జరుగుతుంది . ఇక్కడ కొన్ని యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు . ఈ సినిమా షూటింగ్ చూడడానికి చుట్టు పక్కల జనం రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొన్నది . దాదాపు తన ప్రతి సినిమాలో టెంపుల్ సీన్ ఉండేటట్లు చూసుకుంటాడు దర్శకుడు హరి. ఈ చిత్రానికి కూడా అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు .

ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది . విక్రమ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండడం యాక్షన్ సినిమాలని తెరకెక్కిన్చడంలో మంచి పట్టున్న హరి ఈ చిత్రానికి డైరెక్ట్ కావడం వల్ల ఈ చిత్రం ఫై తమిళ్ తో పాటు తెలుగు లోను మంచి అంచనాలు ఉన్నాయి . తెలుగులో ఈ చిత్రం ‘సామి ‘ పేరుతో విడుదల కానుంది . ఈ చిత్ర తెలుగు హక్కులు కూడా భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి .

తాజా వార్తలు