
తమిళంలో స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ నయనతార. కేవలం పెద్ద హీరోల సినిమాలే కాకుండ కథకు ప్రాధాన్యమున్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడ చేస్తూ దూసుకుపోతున్న ఆమె కొత్త సినిమాను ఈరోజే మొదలుపెట్టారు.
‘మా, లక్ష్మి’ వంటి షాట్ ఫిలిమ్స్ తో బాగా పేరు తెచ్చుకున్న దర్శకుడు సార్జున్ చెప్పిన కథ నఃచడంతో నయనతార ఈ సినిమాకు సైన్ చేశారట. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ ఈరోజే చెన్నైలో మొదలైంది. హర్రర్ థ్రిల్లర్ గా ఉండబోతున్న ఈ సినిమాను కెజెఆర్ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఇది కాకుండా నయనతార ‘సైరా, విశ్వాసం, కోలమావు కోకిల, ఇమాయిక్క నోడిగల్’ వంటి సినిమాలో కూడ నటిస్తున్నారు.

