తెలుగులో ‘జెంటిల్ మెన్ , జై లవ కుశ , నిన్ను కోరి సినిమాల్లో నటించి’ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నివేతా థామస్ . ఈ సినిమాల తరువాత కొంత కాలంగా స్టడీస్ కోసం సినిమాలకు దూరంగా ఉంటుంది.ఇప్పుడు ఆమె మళ్ళి వరుస సినిమాలతో తెలుగులో నటించనుంది.
వీటిలో మొదటగా కళ్యాణ్ రామ్ హీరోగా గుహన్ దర్శకత్వంలో తెరకెక్కనున్నసినిమాలో నటించనుండగా తాజాగా నీది నాది ఒకే కథ ఫెమ్ శ్రీ విష్ణు హీరో గా ‘మెంటల్ మది’లో చిత్రాన్ని తెరకేకించిన వివేక్ ఆత్రేయదర్శకత్వంలో మరో సినిమాలో నటించనుంది . బాల నటిగా నివేతా మలయాళ ,తమిళ సినిమాల్లో నటించింది. ఇక ఆమె ఇప్పటివరకు నాలుగు తెలుగు సినీమాల్లో నటించగా అందులో మూడు సూపర్ హిట్ సాధించడం విశేషం .


