తమన్నా మరింత అందంగా ప్రెజెంట్ చేయనున్న ‘నా నువ్వే’ !

తమన్నా మరింత అందంగా ప్రెజెంట్ చేయనున్న ‘నా నువ్వే’ !

Published on Jun 12, 2018 8:00 PM IST

Naa Nuvve

తమన్నా, కళ్యాణ్ రామ్ జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘నా నువ్వే’ చిత్రం ఇక రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే మూవీ మేకర్స్ ప్రమోషన్లను వేగవంతం చేశారు. ఈ చిత్రంలో తమన్నా పోషిస్తున్న పాత్ర చాలా ప్రదానమైనది చాలా ఆకర్షణీయకరమైనదని చెబుతోంది చిత్ర బృందం.

తాజా సమాచారం ప్రకారం, తమన్నా గత చిత్రాల కంటే ఈ చిత్రంలో చాలా గ్లామరస్ గా కనిపించనుంది. కారణం ప్రముఖ కెమెరామెన్ పిసి శ్రీరామ్ తెరపై తమన్నాను అద్భుతమైన రీతిలో చాలా అందంగా, కొత్తగా చూపించారట. తమన్నా కొంత విరామం తరువాత, తెలుగు సినిమాల్లో ఒక పూర్తి స్థాయి పాత్రలో నటించింది ఈ చిత్రంలోనే కావడం విశేషం. విడుదల చేసిన ప్రోమోలు చూస్తుంటే తమన్నా గతంలో కంటే ఈ సినిమాలో మరింత అందంగాకనిపిస్తోంది. కళ్యాణ్ రామ్ తో ఆమె కెమిస్ట్రీ కూడా బాగా వర్కవుట్ అయింది. ఈ చిత్రానికి జయేంద్ర దర్శకత్వం వహించారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ మరియు కూల్ బ్రీజ్ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మించాయి.

తాజా వార్తలు