యుఎస్ఎ వెళ్లనున్న విజయ్ !

యుఎస్ఎ వెళ్లనున్న విజయ్ !

Published on Jun 13, 2018 1:12 AM IST

vijay6

తమిళ స్టార్ హీరో ‘ఇళయదళపతి’విజయ్ నటిస్తున్న 62 వ చిత్రం పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు సంభందించిన ముఖ్యమైన షెడ్యూల్ కోసం చిత్ర బృందంతో కలిసి యుఎస్ఎ వెళ్లనున్నారు విజయ్ .ఈ షెడ్యూల్ తో సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తవుతుంది . ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నా ఈ సినిమాలో కీర్తీ సురేష్ కథానాయిక గా నటిస్తున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్ , యోగిబాబు , రాధారవి మొదలగు ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు . సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకీ ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.తుపాకీ సినిమా తరువాత విజయ్ , మురుగదాస్ కలయికలో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

తాజా వార్తలు