రోజాగారి అసలు పేరు ఏమిటో తెలుసా !

రోజాగారి అసలు పేరు ఏమిటో తెలుసా !

Published on Jun 13, 2018 1:00 PM IST

Roja

అనేక చిత్రాల్లో కథనాయికగా మరియు విభిన్న పాత్రల్లో నటించి మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు రోజా .గత కొంత కాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాలలో క్రియాశిలక పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం ఆమె టి వి పోగ్రామ్స్లో మాత్రమే కనిపిస్తున్నారు అందులో పాపులర్ కామెడీ షో అయిన ‘జబర్దస్త్’ ద్వారా బుల్లితెర ప్రేక్షకులు చాలా దగ్గరయ్యారు రోజా .

రోజా గురించి సీనియర్ రచయిత, దర్శకుడు పరుచూరి గోపాలకృష్ణ తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు . రోజా అసలుపేరు శ్రీలత 1991లో నేను దర్శకత్వం వహించిన ‘సర్పయాగం’ సినిమాలో రోజా నటించింది. ఆ సినిమా 100 రోజులు ఆడితే నీ వేలుకు ఉన్న ఉంగరం తీసి ఇస్తావా అని రోజా నన్ను అడిగింది. తను చెప్పినట్టుగానే సినిమా 100డేస్ ఫంక్షన్లో ఉంగరం ఇచ్చానని గోపాలకృష్ణ గారు ఈ సందర్బంగా గుర్తుచేసుకున్నారు. అలాగే రాజకీయాల్లోకి రోజా వెళ్లకపోయుంటే శ్రీదేవి అంత గొప్ప నటి అయ్యేదని కూడ ఆయన అన్నారు .

తాజా వార్తలు