నటి శ్రీరెడ్డి సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా నాని పై చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యల సంగంతి తెలిసిందే. నాని ఆమెకు లీగల్ నోటీసులు కూడా పంపాడు. దాని పై కూడా శ్రీరెడ్డి రెచ్చగొట్టే ధోరణిలో కామెంట్ చేసింది. ప్రస్తుతం ‘శ్రీరెడ్డి, నాని’ మధ్య జరుగుతున్న వివాదం పై ప్రముఖ హీరో విశాల్ స్పందించారు.
విశాల్ నటించిన ‘అభిమన్యుడు’ చిత్రం తెలుగులో మంచి విజయం సాధించింది. ఆ చిత్ర విజయోత్సవ యాత్రలో పాల్గొన్న విశాల్ ‘శ్రీరెడ్డి, నాని’ వివాదం పై మాట్లాడుతూ
‘నాని నాకు చాలా సంవత్సరాలుగా తెలుసని తనకు మంచి స్నేహితుడని చెప్పాడు. ‘నాని’ని ప్రత్యక్ష్యంగా చూసిన ఎవరైనా అతను చాలా మర్యాదస్తుడనే చెప్తారని, తోటి మనుషులతో ఎలా ప్రవర్తించాలో నానికి తెలుసని అన్నారు. అయినా నేను, ‘నాని’కి గుడ్డిగా సపోర్ట్ చెయ్యనని చెప్తూ.. (శ్రీరెడ్డి) ఆమె వాఖ్యలు నేను గమనిస్తున్నాను. తాజాగా నానిపై చేసిన ఆరోపణలు అవాస్తవంగా ఉన్నాయి. బహుశా పబ్లిసిటీ కోసం ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందనిపిస్తుంది.
ఒకవేళ ఆమె చెప్పేవి నిజమైతే వాటికి సంబంధించిన ఆధారాలు బయటపెట్టాలి. అంతేగాని ఇలా సెలబ్రిటీలపై ఇష్టమొచ్చినట్టు వ్యక్తిగతంగా ఆరోపణలు చెయ్యటం మంచింది కాదన్నారు. ఆమెను ఇలా విమర్శిస్తున్నందుకు నా పై కూడా ఆరోపణలు చేస్తుందేమో అని విశాల్ నవ్వుతూ అన్నారు. ఇంకా మాట్లాడుతూ ‘కాస్టింగ్ కౌచ్’ అన్నిసినీ పరిశ్రమల్లో ఉందని స్పష్టం చేశారు.


