సాయి ధరమ్ తేజ్ నటించిన ‘తేజ్ ఐ లవ్ యు’ సినిమా ఈ నెలలోనే విడుదలవాల్సి ఉండగా కొన్ని అనుకోని కారణాల వలన జూలై 6న విడుదలకానుంది. ఈ వాయిదా ఒకరకంగా సినిమాకు కలిసొస్తుందనే చెప్పాలి. ఎందుకంటే సినిమా అన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని ముగించుకుని విడుదలకు రెడీగా ఉంది. దీంతో టీమ్ ముందున్న ఒకే ఒక్క పని ప్రమోషన్లు.
ఇంకా దాదాపు 20 రోజులకు పైగానే టైమ్ ఉంది కాబట్టి తేజ్ అండ్ టీమ్ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి స్థాయిలో ప్రచారం నిర్వహించి సినిమాను ఇంకాస్త ప్రభావంతంగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లొచ్చు. ఇప్పటికే ఈ నెల 16న విజయవాడలో ఆడియో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసిన చిత్ర టీమ్ ఆ తర్వాత ఏం ప్లాన్ చేస్తారో చూడాలి. కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ నిర్మించింది.


