హీరో ఆది గత కొన్నేళ్లుగా సరైన విజయాన్ని అందుకోలేకపోయారు. బోలెడు ఆశలతో ఆయన చేసిన ‘నెక్స్ట్ నువ్వే’ చిత్రం కూడ బాక్సాఫీస్ వద్ద పరాజయంగా నిలవడంతో కొంత సమయం తీసుకున్న ఆయన త్వరలో కొత్త చిత్రాన్ని మొదలుపెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఈ చిత్రాన్ని ప్రముఖ రచయిత డైమండ్ రత్నబాబు డిరెజ్ట్ చేయనున్నాడు. ఎన్నాళ్ళగానో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న ఆయన ఎట్టకేలకు ఆది సినిమాతో దర్శకుడిగా పరిచయంకానున్నారు. దీపాల ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రం పూర్తిస్థాయి ఫన్ ఎంటర్టైనర్ గా ఉండనుందని సమాచారం.


