ప్రతి ప్రశంస కొరటాలకే అంకితం అంటున్న మహేష్ !

ప్రతి ప్రశంస కొరటాలకే అంకితం అంటున్న మహేష్ !

Published on Jun 15, 2018 4:00 PM IST

Mahesh koratala

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఉత్తమైన చిత్రాలుగా నిలిచిన ‘శ్రీమంతుడు, భరత్ అనే నేను’ లను కొరటాల శివ దర్శకత్వంలోనే రూపొందాయి. అందుకే కొరటాల అంటే మహెష్ బాబుకి ప్రత్యేకమైన అభిమానం. ఈరోజు కొరటాల శివ పుట్టినరోజు సందర్బంగా ఆయన్ను జీవితం మొత్తం మీరు సంతోషంగా ఉండాలి అంటూ విష్ చేసిన ప్రిన్స్ ‘భరత్ అనే నేను’ చిత్రీకరణ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

సినిమాలో అందరికీ నచ్చిన ప్రెస్ మీట్ సీన్ అంత గొప్పగా రావడానికి, తనలోని ఉత్తమమైన ప్రదర్సన బయటపడటానికి కొరటాల దర్శకత్వ శైలి, ఆయన రాసిన డైలాగులే కారణమన్న మహేష్ ఆ సన్నివేశానికి వచ్చిన ప్రతి ప్రశంసను కొరటాలకే అంకితమిస్తున్నాను అన్నారు. ప్రస్తుతం మహేష్ పైడిపల్లి సినిమా పనుల్లో ఉండగా కొరటాల తర్వాతి సినిమాను ఇంకా అనౌన్స్ చేయలేదు.

తాజా వార్తలు