అక్కినేని హీరోకి అక్కడ డిమాండ్ పెరుగుతుంది !

అక్కినేని హీరోకి అక్కడ డిమాండ్ పెరుగుతుంది !

Published on Jun 16, 2018 10:24 AM IST

Naga chaithanya1

అక్కినేని నాగచైతన్య ‘మహానటి’ చిత్రంలో ఆక్కినేని నాగేశ్వరావుగారి పాత్రలో నటించి మెప్పించారు.అయితే ప్రస్తుతం చైతు చిత్రాలకి ఓవర్ సీస్ లో రోజురోజుకి డిమాండ్ పెరుగుతూ వస్తోంది. చైతూ సవ్యసాచి చిత్రానికి 3 కోట్లు ఇరవై లక్షలకి పైగా రేటు పలికింది. ఇప్పుడు మారుతి దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ఈ చిత్రానికి ఓవర్ సీస్ లో 3 కోట్లు పదిహేను లక్షల రేట్ ను ఫైనల్ చేసారట. ఐ డ్రీమ్ వాసుదేవ రెడ్డి ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ ను తీసుకుంటున్నారు. శైలజారెడ్డి అల్లుడుకి మారుతి బ్రాండ్ కూడా ఉపయోగపడిందని అనుకుంటున్నారు.

అక్కినేని నాగచైతన్య’ శైలజారెడ్డి అల్లుడు’ చిత్రం తర్వాత ‘నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో నటించనున్నారు.ఈ చిత్రంలో నాగచైతన్య సరసన హీరోయిన్ గా ఆయన సతీమణి అక్కినేని సమంత నటిస్తోంది. వీరిది హిట్ కాంబినేషన్.మరి ఆ చిత్రం కూడా హాట్ అవుతుందేమో చూడాలి.

తాజా వార్తలు