బాలయ్య కోసం పవర్ ఫుల్ కథ రాస్తున్నారట !

బాలయ్య కోసం పవర్ ఫుల్ కథ రాస్తున్నారట !

Published on Jun 16, 2018 8:00 PM IST

balakrishna

వినాయక్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా సి.కళ్యాణ్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మొదట పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ అందించారు. ఆ స్క్రిప్ట్ లో చాలామంది చాలా మార్పులు చేర్పులు చెప్పారు. అవన్ని చేస్తే మేము అనుకున్న ఫీల్ మిస్ అవుతుందని పరుచూరి బ్రదర్స్ దర్శకనిర్మాతలను కన్వెన్స్ చెయ్యడానికి ప్రయత్నించిన, చివరకి మార్పులు చెయ్యటానికి ఒప్పుకొక తప్పలేదు. అలాగే మెగాస్టార్ సైరా చిత్రానికి మొదట పరుచూరి బ్రదర్స్ మొత్తం స్క్రిప్ట్ అందించారు. ఆ తర్వాత మరో నలుగురు రచయితలూ ఆ స్క్రిప్ట్ మీద వర్క్ చేయటం జరిగింది. పరుచూరి బ్రదర్స్ రాసినా చాలా సీన్లు సైరాలో తొలిగించారు.

ఈ సారి ఎవరు వంకలు పెట్టని విధంగా బాలయ్య కోసం పరుచూరి బ్రదర్స్ ఒక పవర్ ఫుల్ కథ రాయాలని నిర్ణయించుకున్నారట. మరి 350 సినిమాలు పైన రాసిన రచయితలు నుండి కథ రాబోతుంది అంటే అది ఎంతో పవర్ ఫుల్ కథే వస్తుంది. అయితే బాలయ్య వినాయక్ చిత్రం తర్వాత, బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించనున్నారు. ఈ చిత్రానికి రచయిత ఏం రత్నం.

తాజా వార్తలు