సవ్యసాచి కోసం బాహుబలి వీఎఫ్ఎక్స్ టీం !

సవ్యసాచి కోసం బాహుబలి వీఎఫ్ఎక్స్ టీం !

Published on Jun 17, 2018 4:08 AM IST

Savyasachi

చందు మొండేటి దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న ‘సవ్యసాచి’ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకుంది . ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతున్నాయి. బాహుబలి చిత్రానికి గ్రాఫిక్స్ ను అందించిన మకుట సంస్థ ఈ చిత్రానికి పనిచేస్తుంది . మాధవన్ , భూమికా చావ్లా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది . ఈ సినిమాతోనే నిధి తెలుగు తెరకు పరిచయం కానుంది . క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది .

వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఆగష్టు మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకవచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు . ప్రేమమ్ తరువాత చైతు, చందూ మొండేటిల కలయికలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజా వార్తలు