షూటింగ్ గ్యాప్లో సిటీ చుట్టేస్తున్న చరణ్ హీరోయిన్ !

షూటింగ్ గ్యాప్లో సిటీ చుట్టేస్తున్న చరణ్ హీరోయిన్ !

Published on Jun 18, 2018 4:34 PM IST

Kiara Advani

రామ్ చరణ్, బోయపాటి శ్రీనుల సినిమాలో కైరా అద్వానీ కథానాయకిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతోంది. ఇందులో కైరా అద్వానీ కూడ పాల్గొంటోంది. కానీ ఈరోజు తన షూటింగ్ లేకపోవడంతో ఖాళీగా ఉన్న కైరా అద్వానీ సరదగా సిటీ చుట్టేయాలని ప్లాన్ చేసుకుంది.

అందుకోసం సిటీలో ఏయే ప్రదేశాలు బాగుంటాయి అంటూ ట్విట్టర్ ద్వారా అభిమానుల్ని అడిగింది. దీనికి స్పందించిన అభిమానులు చాలా మంది ఛార్మినార్ బాగుంటుందని సజెస్ట్ చేయడంతో కైరా తన స్నేహితులతో కలిసి ఛార్మినార్ పరిసర ప్రాంతాలకు వెళ్లి, షాపింగ్ చేసి ఛార్మినార్ చాలా అందంగా ఉంది అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తెలుగులో మొదటి సినిమానే మహేష్ బాబుతో చేసి విజయాన్ని అందుకుని, ఇప్పుడు చరణ్ సినిమాలో నటిస్తున్న ఈమెకు ప్రేక్షకుల్లో తక్కువ సమయంలోనే బోలెడంత క్రేజ్ ఏర్పడింది.

తాజా వార్తలు