స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం’ సైరా నర్సింహారెడ్డి’ . మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతుంది. ఈ సినిమా చిత్రీకరణ కోసం కోకాపేట్ దగ్గర 7 ఎకరాల్లో భారీ సెట్ ను నిర్మించారు.
40 రోజుల పాటు జరుగనున్న ఈ షెడ్యూల్ లో సినిమాకు సంబంధించిన ముఖ్య మైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు . ఇన్నిరోజులు నెమ్మదిగా జరిగిన ఈ సినిమా షూటింగ్ తాజా షెడ్యూల్ తో ఊపందుకుంది . మరో వైపు ఈ సినిమా షూటింగ్ ను త్వరగా ముగించి కొరటాల శివ సినిమాకు సన్నద్ధం కావాలని మెగా స్టార్ బావిస్తున్నారట . సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.


