‘హీరోయిన్ అమలాపాల్‌’ పై చార్జిషీట్‌ ?

‘హీరోయిన్ అమలాపాల్‌’ పై చార్జిషీట్‌ ?

Published on Jun 18, 2018 7:00 PM IST

Amala Paul

హీరోయిన్ అమలాపాల్‌’ గత కొన్నినెలలుగా పన్నును ఎగవేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వివరాల్లోకి వెళ్తే నకిలీ అడ్రస్‌తో కారు రిజిస్ట్రేషన్ చేయించుకుని పన్నును ఎగ్గొట్టారని అమలాపాల్ పై చార్జిషీట్‌ వేయనున్నారట. స్వయంగా కేరళ ప్రభుత్వమే చార్జిషీట్ నమోదు చేయాలంటూ పోలీస్ శాఖను ఆదేశించిందని సమాచారం. కాగా కొన్ని రోజులు క్రితం కోర్టులో లొంగిపోయిన అమలాపాల్ ఆ తర్వాత వెంటనే బెయిలు సాయంతో విడుదలయ్యారు.

అమలాపాల్ తప్పుడు అడ్రస్‌ మీద కోటి రూపాయల ఖరీదు చేసే కారును రిజిస్ట్రేషన్ చేయించుకుని కేరళ ప్రభుత్వానికి రూ.20 లక్షల పన్నును ఎగ్గొట్టారు. ఆమెకు పన్ను కట్టేందుకు మరో అవకాశం ఇచ్చినా ఆమె పన్ను కట్టడానికి నిరాకరించారు. దీంతో అమలాపాల్ పై చార్జిషీట్ నమోదు చేయాలని కేరళ ప్రభుత్వం క్రైమ్ బ్రాంచ్‌ కు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది.

తాజా వార్తలు