స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ చిత్రం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో బన్నీ తన తర్వాత చిత్రకథకు సంబంధించి తొందర పడకుండా ఎంతో జాగ్రత్తగా ఉన్నాడు. ఈ లోపు బన్ని చేయబోయే సినిమాలపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారని, అలాగే త్రివిక్రమ్, లేదూ హరీష్ శంకర్ తో అని సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఫిదా చిత్రంతో భారీ విజయాన్ని సాధించిన శేఖర్ కమ్ముల.. అల్లు అర్జున్ కి ఓ కథ వినిపించారు. శేఖర్ కమ్ముల చెప్పిన కథ బన్నికి బాగా నచ్చిందని సమాచారం.
కొన్ని రోజుల్లోనే బన్ని, శేఖర్ కమ్ముల చిత్రం పై తుది నిర్ణయం తీసుకోనున్నాడట. ఒకవేళ శేఖర్ కమ్ముల సినిమా ఓకే కాకపోతే మాత్రం.. విక్రమ్ కె కుమార్ తో కానీ.. హరీష్ శంకర్ తో కానీ తన తర్వాత సినిమా చేసేందుకు బన్ని సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.


