మీతో క‌లిసి ప‌నిచెయ్యడం మాకు దొరికిన గొప్ప వరం !

మీతో క‌లిసి ప‌నిచెయ్యడం మాకు దొరికిన గొప్ప వరం !

Published on Jun 20, 2018 12:08 AM IST


ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో సుదీర్ బాబు హీరోగా వచ్చిన `స‌మ్మోహ‌నం` చిత్రం మంచి విజయం సాధించి, ఇంకా విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఈ చిత్రంలో సీనియర్ న‌రేష్ డీసెంట్ కామెడీ పండించి చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించారు. కాగా `స‌మ్మోహ‌నం` చిత్రంలో ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ కూడా ఓ సన్నివేశంలో క‌నిపించారు. ఆ సమయంలో సీనియర్ నరేష్, హ‌రీష్ శంక‌ర్ తో క‌లిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. హ‌రీష్ గురించి కింది విధంగా కామెంట్ పెట్టారు.

దర్శకుడు హ‌రీష్ శంకర్ తో ‘స‌మ్మోహ‌నం’ చిత్రం సక్సెస్ ను ఆస్వాదిస్తున్నా. ఈ చిత్రంలో హరీష్ శంకర్ నాకు కో-స్టార్‌ గా నటించారు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వహించిన ‘సుబ్ర‌హ్మ‌ణ్యం ఫేర్ సేల్‌’ చిత్రంలో నేను న‌టించాను. హరీష్ శంకర్ తెలుగు సినిమాకి దొరికిన మ‌రో ఆణిముత్యం, నటీనటులను సమర్ధవంతంగా ప్ర‌భావితం చేయ‌గల గొప్ప ద‌ర్శ‌కుడు అతను` అని హ‌రీష్ శంకర్ గురించి సీనియర్ న‌రేష్ ట్వీట్ చేశారు. సీనియర్ నరేష్ ట్వీట్‌ కు హ‌రీష్ స్పందిస్తూ ‘స‌మ్మోహ‌నం’ చిత్రంలో మీ పాత్రను చూడ‌టం మాకు చాలా గొప్ప అనుభూతి సర్. మీతో క‌లిసి ప‌ని చేసే అవ‌కాశం మా జ‌న‌రేష‌న్ ద‌ర్శ‌కుల‌కు దొరికిన గొప్ప వ‌రం. విజ‌యాన్ని ఆస్వాదించండి` అని హ‌రీష్ శంకర్ రిట్వీట్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు