రేపు గ్రాండ్ గా లాంచ్ కానున్న ఎఫ్ 2 చిత్రం !

రేపు గ్రాండ్ గా లాంచ్ కానున్న ఎఫ్ 2 చిత్రం !

Published on Jun 22, 2018 1:00 PM IST

f21

విక్టరీ ‘వెంకటేశ్‌ ,మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్’ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న మ‌ల్టీస్టార‌ర్ చిత్రం ‘ఎఫ్ 2’ ఫ‌న్ అండ్ ఫ్రస్టేష‌న్ ట్యాగ్ లైన్‌.హ్యాట్రిక్ విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయ‌నున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం ఫై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రేపు గ్రాండ్ గా లాంచ్ కానుంది .

ఇక వెంకీ , వరుణ్ లు కలిసి మొదటిసారి నటిస్తుడడంతో ఈ చిత్రం ఫై మంచి అంచనాలు ఉన్నాయి . ఈ చిత్రంలో వీరు తోడల్లుళ్లుగా నటించనున్నారని సమాచారం. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేశ్ కు జోడిగా త‌మ‌న్నా, వ‌రుణ్ తేజ్ కు జోడిగా మెహ‌రీన్ న‌టిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నారు .

తాజా వార్తలు