కాలా కు శాటిలైట్ రూపంలో కలిసొచ్చింది

కాలా కు శాటిలైట్ రూపంలో కలిసొచ్చింది

Published on Jun 27, 2018 1:48 AM IST

Kaala1
సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన కాలా చిత్రం ఇటీవల విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద పేద్దగా వసూళ్లను రాబట్టలేకపోయింది . రజినీ అల్లుడు ధనుష్ నిర్మించిన ఈ చిత్రం తమిళనాడు లో మంచి కలెక్షన్స్ నే రాబట్టిన మిగితా భాషల్లో దారుణంగా విఫలమయింది . ఇక ధనుష్ కి ఈ చిత్రంతో నష్టాలు తప్పవు అనుకుంటున్న సమయంలో శాటిలైట్ హక్కుల రూపంలో ఆయనకి కలిసొచ్చింది .

ప్రముఖ టెలివిజన్ రంగ సంస్థ సన్ నెట్ వర్క్ 60 కోట్లు వెచ్చించి ఈ చిత్ర హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం . తెలుగు ,తమిళ్ , హిందీ భాషలకు గాను ఇంత భారీ మొత్తాన్ని చెల్లించారు . దాంతో దాదాపుగా నష్టాల నుండి బయటపడ్డారు ధనుష్. పా . రంజిత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో నానా పాటేకర్ , హుమా ఖురేషి ముఖ్య పాత్రల్లో నటించారు .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు