గత కొన్ని సంవత్సరాలుగా ప్రభాస్ పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో అనేక వార్తలు రావడంతో పాటు బాలీవుడ్ మీడియాలో కూడా అనేక కథనాలు వచ్చాయి. ఈ మధ్యలో ప్రభాస్ అనుష్కను పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త కూడా బాగా హల్‌చల్ చేసింది. కాగా ప్రభాస్ పెళ్లి గురించి తాజాగా రెబల్ స్టార్ కృష్ణంరాజు స్పందించారు. ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడిన ఆయన ప్రభాస్ చిన్నపిల్లాడు కాదు కదా పదే పదే పెళ్లి చేసుకోమని చెప్పడానికి. అయినా నేను పెళ్లి విషయంలో ప్రభాస్ ను ఎప్పటికప్పుడు తొందర పెడుతూనే ఉంటానని, మా మధ్య పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా త్వరలోనే చేసుకుంటానని ప్రభాస్ చెబుతూ ఉన్నాడని కృష్ణం రాజు చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ప్రభాస్ యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సాహో’ చిత్రంలో నటిస్తున్నారు. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం తర్వాత ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలోనూ ప్రభాస్ ఓ చిత్రం చేయనున్నాడు. ఇది పీరియాడిక్ చిత్రమని, కథ వైవిధ్యంగా ఉంటుందని సమాచారం.


