ఆఖరి దశలో స్టార్ హీరో సినిమా షూటింగ్ !

ఆఖరి దశలో స్టార్ హీరో సినిమా షూటింగ్ !

Published on Jun 27, 2018 6:12 PM IST

swami8

చియాన్ విక్రమ్, త్రిషలు జంటగా రూపొంది 2003లో విడుదలైన ‘సామి’ ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా ‘సామీ స్క్వేర్’ ను రూపొందిస్తున్నారు దర్శకుడు హరి. దాదాపు షూటింగ్ పూర్తిచేసిన చిత్ర యూనిట్ చివరి పాటను పలనిలో షూట్ చేస్తోంది.

ఈ పాటతో చిత్రీకరణ మొత్తం ముగియనుంది. ఈ ఆగష్టులోనే ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలున్నాయి. ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. విక్రమ్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ హెవీ యాక్షన్ ఎంటర్టైనర్ కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో కూడ తమిళంతో పాటే విడుదలచేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు