కొత్త సినిమా సందడిని మొదలుపెట్టనున్న సుధీర్ బాబు !

కొత్త సినిమా సందడిని మొదలుపెట్టనున్న సుధీర్ బాబు !

Published on Jun 27, 2018 10:20 PM IST

Sudheer Babu1
ఇటీవలే విడుదలైన ‘సమ్మోహనం’ సినిమాతో హీరో సుధీర్ బాబుకు కొత్త తరహా ఇమేజ్ ఏర్పడింది. ఆ ఇనేజ్ ను నిలుపుకునేందుకు తన తర్వాతి సినిమాల్ని ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు సుధీర్.

ఇకపోతే సుధీర్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పై మొదటిసారి నిర్మిస్తూ, నటిస్తున్న చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. టైటిల్ తోనే ఆసక్తిని కలిగించిన ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ఈ నెల 29న ఉదయం 10 గంటల 52 నిముషాలకు విడుదలకానుంది.

కొత్త దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన నాబా నతేష్ కథానాయకిగా నటిస్తోంది. అంజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ చేస్తుండగా చోట కె ప్రసాద్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం కూడ రొమాంటిక్ ఎంటర్టైనర్ గానే ఉండనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు