గ్రాండ్‌గా విడుదలవ్వబోతున్న అల్లు శిరీష్ సినిమా !

గ్రాండ్‌గా విడుదలవ్వబోతున్న అల్లు శిరీష్ సినిమా !

Published on Jun 27, 2018 10:54 PM IST

yudhabhumi

మెగా ప్రొడ్యుసర్ అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ ‘1971: బియాండ్ బోర్డర్స్’ చిత్రంతో గత సంవత్సరం మాలీవుడ్ లోకి అడుగు పెట్టారు. ఈ చిత్రంలో మ‌ల‌యాళం స్టార్ ‘మోహ‌న్ లాల్‌’ మేజ‌ర్‌గా నటించగా అల్లు శిరీష్ సోల్జర్ గా నటించారు. 1971లో భారత్‌-పాక్‌ సరిహద్దులో జరిగిన యుద్ధ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మ‌ల‌యాళంలో విజయవంతమైంది. ఈ చిత్రాన్ని ‘యుద్ధభూమి’ పేరుతో ఏయన్‌ బాలాజీ తెలుగులోకి అనువదించారు.

కాగా ఈనెల 29న ఈ చిత్రం 400కు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలవ్వబోతుందని ఈ చిత్ర నిర్మాత ఏయన్‌ బాలాజీ మీడియాకు వెల్లడించారు. మేము ఊహించిన దానికన్నా ఈ యుద్ధభూమి’ చిత్రానికి ఎక్కువ స్పందన వస్తుందని బాలాజీ సంతోషం వ్యక్తం చేశారు. సిద్ధార్ద్ విపిన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి ఎమ్‌.రాజశేఖర్‌ రెడ్డి తెలుగు డైలాగులు అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు