తేజ్ సినిమా హిట్టయేలా ఉంది – రామ్ చరణ్

తేజ్ సినిమా హిట్టయేలా ఉంది – రామ్ చరణ్

Published on Jun 28, 2018 12:00 PM IST

ramcharan4

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘తేజ్ ఐ లవ్ యు’ చిత్రం జూలై 6న విడుదలకానున్న సంగతి తెలిసిందే. వరుస పరాజయాల్లో ఉన్న తేజ్ ఈ సినిమాపైనే బోలెడు ఆశలు పెట్టుకొని ఉన్నాడు. ట్రైలర్ బాగుండటంతో ప్రేక్షకుల్లో కూడ ఈ సినిమా బాగుంటుందనే పాజిటివ్ అభిప్రాయం ఏర్పడింది.

ఇక తాజగా ఈ సినిమా గురించి మాట్లాడిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విజువల్స్, మ్యూజిక్ బాగున్నాయని, కరుణాకరన్ గారి నుండి వస్తున్న నమ్మకమైన సినిమాలా ఉందని అంటూ తేజ్, అనుపమ పరమేశ్వరన్ లకు, నిర్మాతలు కేఎస్ రామారావుకు అభినందనలు తెలియజేశారు. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ చిత్ర పూర్తిస్థాయి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు