తన నెక్స్ట్ సినిమాపై హింట్ ఇచ్చిన రాజశేఖర్ !

తన నెక్స్ట్ సినిమాపై హింట్ ఇచ్చిన రాజశేఖర్ !

Published on Jun 28, 2018 9:00 PM IST

rajasekhar1

సీనియర్ హీరో రాజశేఖర్ గతేడాది ‘గరుడవేగ’ చిత్రంతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర విజయంతో కొత్త జర్నీని మొదలుపెట్టారాయన. ఈ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో రాజశేఖర్ తన తర్వాతి సినిమా ప్రయోగాత్మకంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. గతంలో ఆయన నెక్స్ట్ చిత్రం ‘అ !’ సినిమాతో భిన్నమైన అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మతో ఉంటుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తూ రాజశేఖర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా నా తర్వాతి సినిమా గురించి చెప్పాలంటే అది ‘అ’సమ్ గా ఉండనుంది అన్నారు. ఈ ట్వీట్లో ఆయన ‘అ’ అక్షరాన్ని హైలెట్ చేయడాన్ని చూస్తే గతంలో వచ్చిన వార్తలే నిజమవుతాయని అనిపిస్తోంది. ఇకపోతే ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ‘క్వీన్’ తెలుగు రీమేక్ ను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు