పెళ్లి చూపులు” చిత్రం తో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమైన యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రం తరువాత ఆయన ‘ఈ నగరానికి ఏమైంది?’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ రోజు విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది.
తాజాగా ఈ చిత్రాన్ని చూసిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి ట్విట్టర్ ద్వారా తరుణ్ భాస్కర్ ను ప్రశంసించారు. తరుణ్ భాస్కర్ మళ్లీ తన మ్యాజిక్ ను చూపించాడు. కామెడీ తో కూడుకున్న ఈ చిత్రం చాలా బాగుంది అంటూ చిత్ర యూనిట్ కు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
Tharun Bhascker does it again.
A ‘Sukoon’ film with lots of laughter. Hearty Congrstulations to team #EeNagaranikiEmaindi…— rajamouli ss (@ssrajamouli) June 29, 2018


